Close

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో విస్తృత ఏర్పాట్లుకు పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 12/03/2025

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్న సందర్భంగా హెలి ప్యాడ్, పొలిటికల్ పార్టీ ప్రతినిధులు, జిల్లా అధికారులు సమావేశం కొరకు హాల్స్, ప్రజా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, ఉమెన్స్ కాలేజీ వద్ద కూరగాయలు మార్కెట్ ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. మార్చి 15 మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్ తో నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజ్ లో హెలిపాడ్, ఆడిటోరియం, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నందు ప్రజా వేదిక, స్టాల్స్ ప్రదర్శన, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఉమెన్స్ కాలేజ్ వద్ద కూరగాయలు మార్కెట్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తణుకు పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హెలిప్యాడ్, బారికేడింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ పర్యటనలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, తాడేపల్లిగూడెం, నరసాపురం ఆర్డీవోలు కతీబ్ కౌసర్ భానో, దాసిరాజు, డి.ఎస్.పి డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ టి.రాంకుమార్, తహసిల్దార్ డివివిఎస్ అశోక్ వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తులసీరాధ, హెడ్మాస్టర్లు కే.పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

3.1