రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 11 00 కాల్ సెంటర్ కు అందిన అర్జీల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి … జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ అందిన అర్జీల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెవిన్యూ, పంచాయతీ, సర్వే, మున్సిపల్, వైద్యశాఖ, ఎలక్ట్రిసిటీ, కోపరేటివ్, గృహ నిర్మాణం, సివిల్ సప్లై, ఇరిగేషన్, స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్జీదారులు పెట్టుకున్న సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో విచారణచేసి పరిష్కరించాలన్నారు. 1100 గ్రీవెన్స్ పిటిషన్ లు నిర్ణీత గడువు లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో స్వీకరించబడిన ఫిర్యాదులను సరైన జవాబుదారీతనంతో పరిష్కరించాలని అన్నారు. మండల స్థాయి అధికారుల లాగిన్ లో ప్రతి ఫిర్యాదుని పరిష్కరించే సమయంలో సంబంధిత జిల్లా అధికారి, ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదును ముగించాలని మండల స్థాయి అధికారులుకు సూచించారు. ఇలా చేయడం వలన సంబంధిత శాఖల జిల్లా అధికారులకు, ఆర్డీవోలకు మండల స్థాయిలో జరిగే ఫిర్యాదులపై పూర్తి ఆగవగాహన ఉంటుందని, వారు ఇచ్చే ఎండార్స్మెంట్ క్వాలిటీ తెలుస్తుందని అన్నారు. ప్రజలు వారి సమస్యల పై పెడుతున్న ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కరించారు, క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్జీ దారుడును కలిసి మాట్లాడుతున్నారా లేదా సమస్య పరిష్కారం కానిది అయితే వివరముగా తెలియ జేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సమీక్షించాలని అన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుందని అట్టి వారిపై చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, డిపిఓ రామ్ నాద్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ గీతా బాయి, డీఎస్ఓ ఎన్. సరోజ, జిల్లా సర్వే ఇన్చార్జి అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి జి.పిచ్చయ్య, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఇరిగేషన్ అండ్ డ్రైన్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎలక్ట్రికల్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఫిషరీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.