Close

రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను లోటుపాట్లకు తావు లేనివిధంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 06/01/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్య, వైద్య, పోలీస్, పంచాయతీ, ఫైర్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, తదితర శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లను ఐదో తేదీ ఆదివారం మధ్యాహ్నం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పారిశుధ్య ఏర్పాట్లను డిపిఓ పర్యవేక్షించాలని, నిధులు మంజూరైన రోడ్ల కు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి అధికారులు చేపట్టాలని సూచించారు. పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు ప్లాన్ సిద్ధం చేయాలని తెలిపారు. ప్రోటోకాల్ ఏర్పాట్లును రెవెన్యూ అధికారులు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తదితరులకు ముందస్తు సమాచారాన్ని అందజేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచాలని డిఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇన్చార్జి డి ఎం అండ్ హెచ్ ఓ భాను నాయక్, జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణశ్రీ, ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.జగదీశ్వర్ రావు, ఉండి తహసిల్దార్ కె.నాగార్జున, కాళ్ళ తహసిల్దార్ జి.సుందర్ సింగ్, భీమవరం తహసిల్దార్ రావి రాంబాబు, సహాయ అగ్నిమాపక దళ అధికారి సి హెచ్ సూర్య ప్రకాష్ రావు, ఎంఈఓ లు ఎన్.శ్రీనివాసరావు, బి. వినాయకుడు, బి జ్యోతి, ఆర్ అండ్ బి డి ఈ ఈ సిహెచ్ టీవీఎస్ ప్రసాద్, డీఈఓ ఆఫీస్ సూపర్డెంట్ తిరుపతి రాజు, ఎంపీడీవో జీ స్వాతి, తదితరులు పాల్గొన్నారు.