Close

రాష్ట్రానికి తలమానికంగా భీమవరం సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Publish Date : 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం సుందరీకరణ పనులుపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఏ యే ప్రాంతాలలో ఏ యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఆర్థిక వనరులను సమకూర్చేందుకు పలువురు దాతలతో కూడా చర్చించడం జరిగిందన్నారు. వారు చేపట్టే పనులకు సంబంధించిన డిజైన్లను కూడా ఆర్కిటెక్చర్ ద్వారా రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే కొన్ని పనులను ప్రారంభించుకోవడం జరిగిందని, అలాగే మరికొన్ని పనులు చేపట్టడానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి దాతల సహకారం అవసరం అన్నారు. అమ్యూజ్మెంట్ పార్క్, లైవ్ డాల్ఫిన్స్ పార్క్, సైన్స్ పార్క్ తదితర పార్కులు నిర్మాణాలతో పాటు, ఉన్న పార్కుల అభివృద్ధి, ఖాళీ ప్రదేశాల్లో, రోడ్డు కూడళ్ళలో ఆకర్షణీయమైన కట్టడాలు, ఫౌంటెన్ లు, లైటింగ్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏర్పాటు, డివైడర్స్ కు ఇరువైపులా అందమైన పెయింటింగ్స్, వెల్కమ్ ఆర్చిలు తదితరాల ఏర్పాటుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు. భీమవరం అంటే ఒక ప్రత్యేకత రాష్ట్రమంతా తెలిసేలా ఆకర్షణీయమై కట్టడాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సెలవు దినాల్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి సరైన ప్రదేశాలు, ఏర్పాటులు లేవన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమమైనా పూర్తి చేయలేమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భీమవరం పట్టణం అభివృద్ధికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, లైన్ ఇంటర్నేషనల్ కె.కృష్ణంరాజు, మున్సిపల్ ఈఈ పి.త్రినాధ రావు, డిఈలు అప్పలరాజు, శ్రీనివాస్, రెహమాన్, ఎఈలు రవితేజ, శరత్, తదితరులు పాల్గొన్నారు.