• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రాబోయే 20 రోజుల్లో జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరగాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 24/05/2025

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి

యోగాంధ్ర వెబ్సైట్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనే వారు యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ శాతం ప్రగతిపై శనివారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో వేబేక్స్ ద్వారా మండల వారీగా ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని ప్రతి ఒక్కరు ఆలోచన చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. యోగాంధ్ర వెబ్సైట్లో జిల్లాలో నమోదు శాతం తక్కువగా ఉందని, పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున యోగాంధ్ర వెబ్సైట్లో యోగ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అయ్యేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే తో పాటు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించి వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యేలా చూడాల న్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు, ఉద్యోగులు వెంటనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలన్నారు. ప్రతిరోజు మండల, గ్రామస్థాయిలోయోగ అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హాస్పి టల్స్, కళాశాలు, పాఠశాలలు, అన్న క్యాంటీన్ల వద్ద క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు యోగా చేయడంపై ప్రయోజనాల గురించి తెలియజేస్తూ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యేలా చూడాల న్నారు. జిల్లా, మండల గ్రామస్థాయిలో యోగ పై పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్థాయిలో ఎంపికైన వారికి మండల స్థాయి, మండల స్థాయి నుంచి ఎంపికైన వారికి జిల్లా స్థాయి స్థాయిలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాకు మంచి పేరు వచ్చేలా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వేబేక్స్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఇఓ ఇ.నారాయణ, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై. దోసి రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, జిల్ల టూరిజం శాఖ అధికారి ఏ.అప్పారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.