Close

రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నాణ్యమైన, స్థానిక వినియోగానికి అనుకూలమైన సాగు రకాలను పండించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు

Publish Date : 17/05/2025

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో రాబోయే ఖరీఫ్ సీజన్లో జిల్లా, మండల ప్రాంతాలవారీగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు రకాలపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పండిస్తున్న పిఆర్ 126 వరి రకాన్ని ఎగుమతి దారులు, వినియోగదారులు, ప్రాధాన్యత చూపకపోవడం వలన ఈ రకాన్ని ప్రోత్సహించకూడదని వ్యవసాయ అధికారులకు సూచించారన్నారు. ప్రత్యామ్నాయ రకాలైన ఎన్ ఎల్ ఆర్ 3238, ఎన్ టి యు 1293, ఎం టి యు 1010, ఎం టి యు 1224 వరి రకాలను ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యముగా ప్రతి వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో విధిగా రైతులతో చర్చించి ఆయా ప్రత్యామ్నాయ రకాలను ఖరీఫ్ పంటకు సాగు చేయించాలని ఆదేశించారు. ఎం టి యు 1010 వరి రకం పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరణ నిలిపి వేయడం వలన ఆ వరి రకం పండించినప్పుడు బయట మార్కెట్లో ఎగుమతులకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే సేకరించే విధంగా అనుమతి కొరకు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయాలని డి ఎం సివిల్ సప్లయ్ అధికారిని ఆదేశించారు. సి సి ఆర్ సి కౌలు రైతు కార్డులు తప్పనిసరిగా కౌలు రైతులకు మాత్రమే జారీ చేసే విధంగా వ్యవసాయ అధికారులు, తహాసిల్దారులు సంయుక్తంగా కలిసి పోలంబడి కార్యక్రమంలో పట్టాదారు రైతులను ఒప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డిఎం సివిల్ సప్లైస్ అధికారి టి.శివరాం ప్రసాద్, డిఎస్ ఓ ఎన్.సరోజ, ఏ ఎస్ ఓ ఎం.రవిశంకర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతి రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయ రాజు, మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ గిరిజారాణి, డిపిఎం. వై.నూకరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.