Close

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …

Publish Date : 03/02/2025

బాలిక‌లకు భ‌రోసానిద్దాం, సమాన హక్కులు కల్పించి సమాజంలో గౌరవంగా ఏదగనిద్దాం.

ఆడ‌పిల్ల‌ల ఆత్మరక్షణ మనఅంద‌రి సామాజిక బాధ్య‌త‌.

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలి.

బాలిక‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా నిలవడంతోపాటు, వారి బంగారు భ‌విష్య‌త్తుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం పెనుమంట్ర మండలం మార్టేరు – నెగ్గిపూడి గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి ఉన్నత పాఠశాలలో “ఆడపిల్లల ఆత్మరక్షణ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు శ్రీమతి చదలవాడ నాగరాణి జిల్లాలో మొట్టమొదటిగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షన్ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో ఈ రోజు నుండి మార్చి 15 వ తేదీ వరకు 32 రోజులు పాటు పని దినాలలో ప్రతి పాఠశాలలో రోజుకు ఒక గంట చొప్పున 20 రోజులు పాటు, జిల్లాలో ప్రతి పాఠశాలలో జరిగేలా చర్యలు తీసుకున్నామని, మార్చి 15 వ తేదీలోగా పూర్తయ్యాలా కార్యక్రమాన్ని డిజైన్ చేశామన్నారు. రూపేష్ వెల్ఫేరు సొసైటీ నుండి 50 మంది కరాటే ఉపాధ్యాయులను కేటాయించామన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాలికలు విద్యలో రాణించడంతోపాటు బలంగా ఉండటం మరియు ఆత్మవిశ్వాసంతో సాధికారత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బాలికలు తమను తాము రక్షించుకునే నైపుణ్యాలు మరియు విశ్వాసంతో సాధికారత కల్పించేందుకు రూపొందించ బడిన పరివర్తనాత్మక స్వీయ-రక్షణ శిక్షణా కార్యక్రమం అన్నారు. ఈ చొరవ శారీరక ఆత్మరక్షణపై దృష్టి పెట్టడమే కాకుండా బాలికలలో భద్రత, అవగాహన మరియు స్థితిస్థాపకత యొక్క భావాన్ని కలిగించడం కూడా లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగు తుందన్నారు. మాస్టరింగు సెల్ఫ్- డిఫెన్స్ – జూడో, టైక్వాండో మరియు కరాటేలో బలం మరియు చురుకుదనం పెంపొందించడానికి శిక్షణ ఇస్తుందన్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, అసురక్షిత పరిస్థితులను గుర్తించడం మరియు సమర్థ వంతంగా స్పందించడం ఎలాగో నేర్చుకోవాలో తెలియజేస్తారన్నారు. తమ కోసం మరియు ఇతరుల కోసం నిలబడటం,బాలికలలో ధైర్యం మరియు సంఘీభావాన్ని ప్రోత్సహించడం జరుగు తుందన్నారు. సపోర్టు సిస్టమ్‌లకు యాక్సెస్, మహిళల హెల్ప్‌లైన్‌లు మరియు చట్టపరమైన వనరుల వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.హెల్తీ వర్సెస్ అన్‌హెల్తీ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం,వ్యక్తిగత భద్రత మరియు శ్రేయస్సు గురించి అవగాహన ప్రతి ఒక్కరికీ కల్పించడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ శక్తివంతమైన కార్యక్రమం 80 ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు 230 ఉన్నత పాఠశాలలకు చేరుకుంటుందని, 6 నుండి 9 తరగతుల వరకు సుమారు 25,000 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఈ యువకులు ఆత్మరక్షణ నైపుణ్యాలను మాత్రమే కాకుండా నావిగేట్y చేయగల విశ్వాసాన్ని కూడా పొందుతారని, ప్రపంచం నిర్భయంగా ఈ కార్యక్రమం కేవలం శిక్షణ కంటే ఎక్కువ ప్రతి అమ్మాయికి సురక్షితమైన, బలమైన మరియు మరింత సాధికారత కలిగిన భవిష్యత్తు వైపు ఉద్యమంలా శిక్షణ సాగుతుందన్నారు.ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అలవర్చు కుంటారని,ప్రతి సమస్యని ఒంటరిగా ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఏ విధంగా ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు వెళ్లాలో అవగాహన కల్పిస్తారని అన్నారు.18 ఏళ్ల వచ్చేవరకు చదువు మానేయకుండా ముందుకు వెళ్ళాలని, సెల్ ఫోన్లు,టాబ్లు చూడటం తగ్గించాలని కాలం విలువ తెలుసుకుని నిరంతరం చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.బాలిక‌ల‌కు సామాజికంగా,ఆర్థికంగా, మాన‌సికంగా భ‌రోసానిచ్ఛి అండగా ఉండాలని పిలుపు నిచ్చారు.బాలిక‌ల‌కు అన్ని విధాలా భరోసా ఇచ్చి వారికి మంచి భ‌విష్య‌త్తును క‌ల్పించేందుకు అన్ని విధాలుగా కృషి చేద్దామ‌న్నారు.జిల్లా యంత్రాంగం త‌ర‌పున బాలికలకు సంపూర్ణ స‌హ‌కారాన్ని,భద్రతను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. బాలికలు, మహిళలుపై జ‌రుగుతున్న దాడుల‌ను అరిక‌ట్ట‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బాలికల సాధికారత కోసం అత్యంత శక్తివంతమైన సాధనాల్లో విద్య ఒకటని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ఆరోగ్య వంతమైన జీవితాలను గడుపుతారన్నారు. ఉన్నత చదువు వలన వివాహాన్ని ఆలస్యం చేసే అవకాశం ఉందని, తక్కువ పిల్లలను కలిగి ఉండి పేదరికంలేని సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. బాలిక‌లు వారు కోరుకున్న చదువులు,ఆరోగ్యంతో పాటు రక్షణ కల్పిస్తే నవసమాజ నిర్మాణానికి పునాది పడుతుంది అని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ,సర్వశిక్ష అభియాన్ ఏపిసి పి.శ్యామ్ సుందర్,కమ్యూనిటీ ఇన్మ్యూషన్ అధికారి వై.చంద్ర శేఖర్,తహాశీల్దారు ఏ.వై. రవికుమార్,యంపిడివో పి.శామ్యూల్,మండల విద్యాశాఖ అధికారులు ఉంగరాల నాగేశ్వరరావు, వై.లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.చిన సూర్యనారాయణ రెడ్డి, విశ్రాంత ఫిజికల్ డైరెక్టరు కర్రి కృష్ణారెడ్డి,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జాలెం చిన్న, ఉపాధ్యాయులు,నాన్ టీచింగు సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

1.11

1.22