• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రక్తదాన పక్షోత్సవ ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 04/08/2025

ఆగస్టు 5 తేదీ నుండి 18 వ తేదీ వరకు డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రక్తదాన ప్రచార గోడపత్రికను డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామ పీ.డి డా.కెసీహెచ్ అప్పారావు, గ్రామ,వార్డు సచివాలయ అధికారి వై.దో సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రిరాజులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో శుక్రవారం మరియు మూడో శుక్రవారం ఒక్కొక్క శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రక్తం కొరత కారణంగా ఏ ఒక్కరు ప్రాణం పోకూడదని ఉద్దేశంతో రక్తదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్, డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 5 తేదీ నుండి 18 తేదీ వరకు రోజుకు రెండు మండలాల చొప్పున 10 రోజులో 20 మండల కేంద్రాల్లో డి ఆర్ డి ఏ ఉద్యోగులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరితో రక్తదానంపై చైతన్య రావడం జరుగుతుంది అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖలు ఆయా అనుబంధసంస్థల ఉద్యోగులలో రక్తదానంపై అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రిరాజు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామ పీ.డి డా.కెసీహెచ్ అప్పారావు, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి జి.పిచ్చయ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, డిఎంహెచ్వో డా.జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.