Close

యోగ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 30/05/2025

శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి యోగా రిజిస్ట్రేషన్స్, మాస్టర్ ట్రైనర్స్, ట్రైనర్స్ మ్యాపింగ్, యోగా పోటీలు, తదితర అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తాహసీల్దార్లు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలను సన్నద్ధం చేయాలన్నారు. జిల్లాకు10 లక్షల రిజిస్ట్రేషన్స్ లక్ష్యంకాగా నేటి వరకు 5,12,403 రిజిస్ట్రేషన్స్ మాత్రమే పూర్తిచేయడం జరిగిందన్నారు. కొన్ని మండలాలు రిజిస్ట్రేషన్ లో బాగా వెనుకబడి ఉన్నాయని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో రిజిస్ట్రేషన్స్ వేగవంతం చేసి టాల్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. యోగ సాధన ద్వారా కలిగే ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. జిల్లాలో అన్ని సచివాలయం పరిధిలో యోగా పోటీలను నిర్వహించాలన్నారు. ప్రతి సచివాలయంలో జరిగే యోగా కార్యక్రమాలు నాణ్యతతో ఉండాలన్నారు. ఫోటోలు లాగిన్ లో అప్డేట్ చేసి, సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు. యోగ కార్యక్రమంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో మొదటి వరసలో ఉండే విధంగా అధికారులందరు సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్నారు.

గూగుల్ మీట్ లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏవి అప్పారావు, జిల్లా ఆయుష్ అధికారి హరి శ్రీనివాసరావు, యోగ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.