యోగాంధ్ర ప్రచారంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
జూన్ 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర ప్రచారం – యోగా పోటీ ప్రణాళిక” – 2025 ను రూపొందించిందని దీనికి అనుగుణంగా కార్యాచరణ పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మే 21 నుండి జూన్ 21 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామం, వార్డు, మండలం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో యోగా పోటీలను పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో పాల్గొనదలచిన విద్యార్థులు, ప్రజలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయములో యోగాంధ్ర యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. పురుషులు మరియు మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించ బడతాయని తెలియజేశారు. మూడు విభాగాలలో పోటీలు నిర్వహించబడతాయన్నారు. జూనియర్ 10 – 18 సంవత్సరాలు, యంగ్ 19 – 35 సంవత్సరాలు, సీనియర్ 35 సంవత్సరాలు మరియు అంతకంటే పైబడి మూడు గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలు వ్యక్తిగత కేటగిరిలో, గ్రూప్ కేటగిరీలో నిర్వహిస్తారు అన్నారు.
వ్యక్తిగత, సమూహ ప్రదర్శనలో. ఆసన ప్రదర్శన, సూర్య నమస్కార సవాలు, ప్రాణాయామ ప్రదర్శన, ధ్యాన ఓర్పు సమూహ ప్రదర్శన, సింక్రనైజేడ్ సమూహ యోగా, మిక్సడ్ ఏజ్ సమూహ యోగా కేటగిరీలు కళాత్మక యోగా పోటీలు, యోగా పాటలు, యోగా పెయింటింగ్, యోగా స్కిట్ మరియు రోల్ ప్లే నాలెడ్జ్ బేస్డ్ పోటీలు, యోగా క్విజ్, యోగా పోస్టర్, యోగా నినాదం, యోగా వ్యాసం కేటగిరీలు, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ ఈ పోటీ 25 రోజుల షెడ్యూల్‌లో నాలుగు స్థాయిలలో జరగనున్నాయి.
గ్రామం, వార్డు స్థాయిలో మే 26 నుండి మే 30, 2025 వరకు – : అందరికీ యోగా థీమ్ తో గ్రాస్‌రూట్స్ వెల్నెస్, మండల స్థాయిలో జూన్ 2 – జూన్ 7, 2025 వరకు యోగా ద్వారా ఐక్యత – కమ్యూనిటీలను అనుసంధానించడం థీమ్ తో, జిల్లా స్థాయిలో జూన్ 9 – జూన్ 14, 2025 – : యోగా మరియు యువత –ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడం థీమ్ తో నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర గ్రాండ్ ఫినాలే జూన్ 16 – జూన్ 18, 2025 – థీమ్: యోగాంద్ర– ఆంధ్రా గ్లోబల్ యోగా షోకేస్.
ఇందుకు సంబంధించిన మార్గ నిర్దేశాలు యోగాంధ్ర యాప్ నందు పొందుపరచడం జరిగిందని, ఎవరైనా ఆశక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత గ్రామవార్డు సచివాలయమును సంప్రదించి, యోగాంధ్ర యాప్ నందు రిజిష్టర్ చేసుకొవాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.