యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించారు. విద్యాశాఖ, ఆయుష్‌శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్ ట్రైనర్స్‌కు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఆదివారం కూడా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది యోగా ట్రైనర్స్‌కు మెరుగైన శిక్షణ ఇచ్చి నెలరోజులపాటు వీరిద్వారా గ్రామ, వార్డు స్థాయిలోని ప్రజలందరికీ యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించారు. యోగ గురువులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, బిహెచ్ఇ సత్యనారాయణ రాజు, పి ఎస్ డి భవాని మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇచ్చారు. పలు రకాల యోగసనాలను ఎలావేయాలి, వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను క్లుప్తంగా వివరించారు. యోగాతో మెరుగైన జీవనానికి దోహదపడే విధంగా మాస్టర్ ట్రైనర్లకు యోగాసనాలపై మెలకువలను నేర్పించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ ట్రైనర్లను ఉద్దేశించి జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగా శిక్షణా శిబిరంలో చక్కగా యోగా శిక్షణ తీసుకొని, తదుపరి మండలాలలో యాబై మందికి శిక్షణ అందించాలని తెలిపారు. మండల స్థాయిలో శిక్షణ అందించుటకు మాస్టరు ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్లు బాద్యత కీలకమని, మండలంలో శిక్షణ తీసుకున్న ట్రైన్లర్లు గ్రామాలలో కనీసం యాబైమందికి తక్కువ కాకుండా యోగా నేర్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరు యోగాంధ్ర యాప్ నందు నమోదు కావాలని, అదేవిధంగా ప్రజలు పెద్దఎత్తున యాప్ లో రిజిస్ట్రేషను చేసుకొని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసేవిధంగా అవగాహన, ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేసేవిధంగా ప్రోత్సహించాలని, యోగాతో ఆరోగ్యం వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, జిల్లా టూరిజం శాఖ అధికారి ఎ.అప్పారావు, డి ఎస్ డి ఓ రాజేష్,
జిల్లా ఆయుష్ శాఖ సిబ్బంది, మాస్టరు ట్రైనర్లు, యోగా సంస్థల అబ్యాసకులు, తదితరులు పాల్గొన్నారు.