Close

యోగాంధ్రాను విజయవంతం చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 23/05/2025

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే యోగపై పలు కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర 2025కు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఆయుష్, మెడికల్, ఎడ్యుకేషన్, రెవిన్యూ సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జూన్ 19వ తేదీన నిర్వహించవలసిన యోగాంధ్ర ఏర్పాట్లుపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా క్యాంపులు నిర్వహించాలని తద్వారా ప్రజల జీవన శైలిపై యోగా యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా చేయాలని అన్నారు. గ్రామ మండల జిల్లా స్థాయిలో యోగా నిర్వాహకులను గుర్తించి వారి చేత పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. స్కూలు పునః ప్రారంభించిన అనంతరం పాఠశాలలు కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. యోగా అంశంపై వివిధ రకాల వకృత్వ పోటీలు పెయింటింగ్, కాంపిటేషన్, స్లోగన్లు, సూర్య నమస్కారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ తప్పనిసరిగా పాల్గొనాలని వారందరికీ కామన్ డ్రెస్ ఉండేలా ఆయుష్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. జూన్19వ తేదీన సుమారు 5 వేల మంది యోగ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. యోగా చేయటంపై ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రతి ఒక్కరు యోగాలో పాల్గొనేలా చేయాలని అన్నారు. శాఖల వారీగా నిర్వహించే విధులు గురించి ఆయా శాఖల అధికారులుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పలు సూచనలను ఇచ్చారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ భీమారావు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై .దోసిరెడ్డి, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డి ఎం మం హెచ్ ఓ జి.గీత బాయి, ఆయుష్ స్పోర్ట్స్ మరియు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.