Close

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 04/02/2026

ఏకీకృత కుటుంబ సర్వేలో పాల్గొనడం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను పొందవచ్చు

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లో భాగంగా లబ్ధిదారుని వివరాలు స్వయంగా మొబైల్ అప్లికేషన్ యాప్ లో అప్లోడ్ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం మండలం చినఅమిరం 1వ సచివాలయం వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే ఏ విధంగా జరుగుచున్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామంలో ఉదయగిరి నాగసత్యవాణి లబ్ధిదారుని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బుక్ తదితర వివరాలను స్వయంగా మొబైల్ అప్లికేషన్ యాప్ లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ఎంపీడీవోకు తెలియజేయాలన్నారు. సర్వేలో అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధించిన సిబ్బందిని ఆదేశించారు. సర్వే పూర్తి చేసుకోవడం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను పొందవచ్చని, ప్రతి ఒక్కరు సర్వేను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ రాజా నాగేశ్వరరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ రాము, తదితర సిబ్బంది ఉన్నారు.