Close

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా పెద్ద ఎత్తున అవగాహన ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు

Publish Date : 19/06/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “నషా ముక్త్ భారత్ అభియాన్” క్యాంపెన్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. జూన్ 26న మాదకద్రవ్యాలు నిరోధక దినోత్సవం సందర్భంగా యువతకు అవగాహన కల్పించేందుకు పలు సందేశాత్మక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వకృత్తుత్వం పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ హాట్‌స్పాట్ ను గుర్తించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వర్క్ షాప్ లు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రానున్న వారం లోపు డి ఎడిషన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని మార్చడం కన్నా, ముందుగా నిరోధించడమే లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో దివ్యాంగులు శాఖ సహాయ సంచాలకులు రామ్ కుమార్, డి సి హెచ్ ఎస్ పగడాల సూర్యనారాయణ, ఎక్సైజ్ సీఐ ఆర్ వి. ప్రసాద్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయ రాజు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి , డి ఐ ఈ ఓ కార్యాలయం సూపరింటెండెంట్ ఎం కనకదుర్గాదేవి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ కే చిట్టి వెంకయ్య, సిడిపిఓ టీకేవీ లక్ష్మీకాంతం, విద్యా, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.