“మొంథా తుపాను” సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
తుఫాన్ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైనదని, కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
…..రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా.
“మొంథా తుపాను” నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ఏర్పాట్లుపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించేందుకు సోమవారం భీమవరం కలెక్టరేట్ చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి లతో సంయుక్తంగా సమీక్షించారు.
అనంతరం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని జిల్లాలో తుఫాన్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు చేపట్టిన చర్యలను ఆర్.పి సిసోడియా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆర్.పి సిసోడియా మాట్లాడుతూ మొంథా తుఫాన్ కాకినాడకు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, మంగళవారం రాత్రికి కాకినాడ మచిలీపట్నంల మధ్య తుఫాన్ తీరం దాటవచ్చు అన్నారు. తుఫాన్ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా కీలకమైనదని, కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు, 26 పక్కా భవనాలను పునరావాస కేంద్రాల నిర్వహణకు సిద్ధం చేయడం జరిగింది, ఒక ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం నరసాపురంలో సిద్ధంగా ఉందన్నారు. 68 జేసీబీలు, 57 పవర్ సాసర్లు సిద్ధం చేయడం జరిగింద న్నారు. లోతట్టు ప్రాంతాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నీటి తొలగింపు చర్యలను పక్కాగా నిర్వహించాలన్నారు. గర్భిణీ స్త్రీలను, వృద్ధులను స్థానిక పీహెచ్సీలకు తరలించడం జరిగిందన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డివైడర్ల మధ్యలో హోర్డింగ్స్ ను తొలగించాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రోడ్లమీద ప్రైవేట్ వెహికల్స్ తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి ఆదేశాలు జారీ చేశారు.
పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం పాల్గొన్నారు.