మిల్లుల వద్ద ధాన్యం లోడులు దిగుమతుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ అన్నారు.

మంగళవారం పెంటపాడు మండలం ఆకుతీగలపాడు విజయ కృష్ణ రైస్ మిల్లు, దర్శిపర్రు రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి డాక్టర్ మనజీర్ జిలాని సామూల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం లోడులు వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన బియ్యం డెలివరీలు పూర్తి చేయాలని ఆవేశించారు. దర్శిపర్రు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో సాగు వివరాలు, ధాన్యం వివరాలు, గోనే సంచుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రైతులతో మాట్లాడుతూ కనీస మద్దతు ధర, నాణ్యత ప్రమాణాలను రైతులకు వివరాలను తెలియజేసి, కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సరిపడా గోనెసంచులను ఇస్తామని, రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదని, రైతులు వద్ద ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సహాయ సహకారాలను అందజేస్తుందని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బంది కి గాని, మండల స్థాయి కమిటీ కి గానీ, జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653 లకు గాని తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. రైతులను దళారుల ఆశ్రయించి ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని ధాన్యం రైతు సేవ కేంద్రాల్లో విక్రయించుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి శివరామ ప్రసాద్, ఇన్చార్జి తహాసిల్దార్ సీతా రత్నం, ఎంఏఓ, తదితరులు ఉన్నారు.