మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే-ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి .
ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులను, కొత్తగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం కనపరిచే వ్యక్తులను ఒకే తాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమమే మార్గదర్శిగా నమోదు…
మార్గదర్శిగా నమోదు కావాలని ఏ ఒక్కరు ఒత్తిడి చేయరు, చేయకూడదు..
సమాజంలో పేద వర్గాలకు పి-ఫోర్ ద్వారా చేకూరనున్న లబ్ధికి ఎవరు అవరోధం కావద్దు..
పి-ఫోర్ పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు…
.. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యంత పేద వర్గాలను సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పిఫోర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని బంగారు కుటుంబాలుగా నామకరణ చేసి, సేవా హస్తం అందించే వారిని మార్గదర్శిలుగా పిలవడం జరుగుతుందన్నారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోందన్నారు. మార్గదర్శిలు నమోదుకు ఏ విధమైన ఒత్తిడి లేదన్నారు. ఆర్థిక అసమానతలు మరింతగా తగ్గితేనే సమాజానికి హితువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే పి4 ను చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు బంగారు కుటుంబంలో సాయం పొందినవారే రేపు మార్గదర్శిగా కావచ్చు అన్నారు. మార్గదర్శిలుగా నమోదైన వారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు సమకూర్చుడం లేదా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ కుటుంబాలను ఆర్ధికంగా పైకి తీసుకురావడం, తదితర మార్గాల ద్వారా సహాయాన్ని, సేవలను అందజేయవచ్చు అన్నారు. పి4 కార్యక్రమంపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్ఆర్ఐ లు, పారిశ్రామికవేత్తలు, వైధ్యులు, పెద్ద అక్వా రైతులు, భూస్వాములు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యములు, ఇతర ఆర్ధికంగా ఉన్నత వర్గాలకు చెందిన వారికి గత 15 రోజులుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పి4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ పూర్తి అవగాహన కలగచేయడం జరుగుచున్నదన్నారు. ఈ అవగాహన సమావేశాలలో భాగంగా జన్మభూమికి, వారు నివసించే ప్రాంతానికి, పేద వర్గాలకు సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారు మార్గదర్శులుగా నమోదు కావచ్చని సూచించడం జరిగిందన్నారు. ఏ ఒక్కరూ కూడా నిర్బంధంగా మార్గదర్సులుగా నమోదు కావాల్సిన అవసరం లేదన్నారు. ఆర్ధికంగా ఉన్నత స్తితిలో ఉన్నావారు, లేక వారి ఇష్టనుసారం స్వచ్ఛందంగా మార్గదర్సులుగా నమోదు చేసుకోని వారికీ నచ్చిన బంగారు కుటుంబములనే దత్తతు తీసుకోవచ్చని సూచించారు. ఆసక్తి కలిగిన వారు మార్గదర్శకులుగా http://zeropovertyp4.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు కావచ్చునని సూచించారు. మార్గదర్శిగా వివిధ రకాల సేవలను అందించవచ్చని, ఆర్థికంగా ఒక్కటే కాదని, సేవా తత్పరతతో చేసే ఏ కార్యక్రమం అయినా నిర్వహించవచ్చు అన్నారు. ఒక సారి వెబ్ సైట్ లోని సేవలను పరిశీలిస్తే ఏ సేవలను మీరు ఎంచుకోవచ్చునో అవగాహన వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పి4 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక లక్ష్యంతో చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ లక్ష్యాన్ని వక్రీకరించి ఎవరు ప్రచారం చేయవద్దని ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో కోరారు.