మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దోహదపడతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
క్రీడాజ్యోతి ని వెలిగించి నేడు ఘనంగా ప్రారంభించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడలు…
నేడు, రేపు రెండు రోజులపాటు డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్న క్రీడలు.
9 క్రీడాంశాలలో పాల్గొననున్న 235 బృందాలు… 56 మంది అథ్లెటిక్స్…
స్వయంగా ఆటలు ఆడి క్రీడా స్ఫూర్తిని రగిలించిన జిల్లా కలెక్టర్.
జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గోదావరి క్రీడా ఉత్సవాలు శనివారం కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా స్థాయి పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కీడాజ్యోతిని వెలిగించి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. తొలుత క్రీడాజ్యోతిని వెలిగించిన క్రీడా పరుగుతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి క్రీడాజ్యోతిని అందించగా వారు తదుపరి … ఇలా ఒక్కొక్క జిల్లా అధికారికి అందిస్తూ చివరికి క్రీడాజ్యోతి జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. అనంతరం క్రీడాకారులలో స్ఫూర్తి నింపేందుకు క్రీడా ప్రతిజ్ఞను డిఎస్డివో అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఉద్యోగి క్రీడలలో పాల్గొనడం ద్వారా ఉద్యోగ విధులను చురుగ్గా నిర్వహించడానికి కృషి చేయాలి అన్నారు. నేడు ఉద్యోగంలో చరవాణి ముఖ్య భూమిక పోషిస్తున్నదని, గతంలో కార్యాలయం విడిచి వెళ్ళి, మరుసటి రోజు కార్యాలయానికి వచ్చేవరకు ఎక్కువ శాఖల ఉద్యోగులు ఉద్యోగ విధులకు దూరంగా కుటుంబంతో ఉల్లాసంగా ఉండేవన్నారు. నేడు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో టెక్నాలజీతో మనమంతా మేమేకమై సమయంతో నిమిత్తం లేకుండా ఎక్కడవున్న చరవాణితో విధులను నిర్వర్తించడం తప్పని పరిస్థితి అన్నారు. ఇంత ఒత్తిడిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆటవిడుపు, శాఖల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం పెంపొందేల మన జిల్లాలో మాత్రమే గోదావరి క్రీడ ఉత్సవాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగిస్తూ క్రీడలలో పాల్గొంటారని ఆకాంక్షించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు గోదావరి క్రీడా ఉత్సవాల పేరిట క్రీడలను తొలుత మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించడం జరిగిందని, వీటిలో ఉత్తమ ప్రతిభను కనపరచిన టీం లను బృందాలుగా చేర్చి నేడు జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఫిట్నెస్ మీద అందరూ అవగాహన కలిగి శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
చివరిగా క్రీడలను ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ క్రికెట్ క్రికెట్ బ్యాటింగ్ చేయగా జిల్లా కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ బౌలింగ్ చేశారు. అనంతరం వాలీబాల్, టెన్ని కాయిట్ స్వయంగా ఆడి క్రీడలను ప్రారంభించారు.
కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓలు కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, దాసిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.