మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంచాలి* –జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

డ్రగ్స్ రహిత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను తీర్చిదిద్దుదాం.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బగా భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి, అడిషనల్ ఎస్పీ కే.భీమారావు, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కి బానిసలూ కాకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తాయన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు, స్నేహితులపై నిఘా ఉంచి వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఆల్కహాల్ వినియోగం ఫ్యాషన్ గా మారిపోయిందని ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ ముఖ్యంగా యువత విద్యపై దృష్టి కేంద్రీకరించాలని ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే పోలీస్ వారికి తెలియజేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
. రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ చదువుకునే దశలో విద్యార్థిని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని చెడు స్నేహాల వైపు వెళ్ళకూడద అన్నారు. ఇటీవల యువత ఆల్కహాల్, గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు వారి పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. ఆల్కహాల్, గంజాయి వినియోగానికి అలవాటు పడితే వారి భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందన్నారు. యువతను, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి అలవాటు చేస్తున్నారని అటువంటి వారి వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్లో గాని, 1972 గాని కాల్ చేస్తే తగు చర్యలు తీసుకుంటారన్నారు.
ఈ ర్యాలీలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ కే.భీమారావు, ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ ఆర్ఎస్ కుమారేశ్వరన్, డీఎస్పీ జయ సూర్య, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు, డిఎన్ఆర్, ఎస్ ఆర్ కె ఆర్, బివి రాజు, ఆదిత్య కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, మెంటే పార్థసారథి, ఇందుకూరి రామలింగరాజు, మేరగని నారాయణమ్మ చెరుకువాడ రంగ సాయి, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.