• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

మహిళా సమైక్య సభ్యులు వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికపురోభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Publish Date : 13/08/2025

బుధవారం ఉండి మండలం మహాదేవపట్నలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘంకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ.8.75 లక్షల సబ్సిడీతో మంజూరుచేసిన రూ.25 లక్షల వ్యయంతో నెలకొల్పిన “స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని” రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారుచేసే చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. చక్కటి నిద్రను కలిగిస్తాయని పరిశోధనలో తెలిందన్నారు. ఎంటువంటి రసాయనాలు కలపని నేచురల్ చాక్లెట్స్ నేడు ప్రారంభించిన “స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీ” లో తయారు అవుతున్నాయన్నారు. మన జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోకో సాగుఅవుతున్నదని, కోకో రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. న్యాచురల్ చాక్లెట్ల వినియోగంపై విస్తృత ప్రచారం ద్వారా బ్రాండింగ్ ఏర్పచుకోవాలన్నారు. విందు భోజనాలు, గిఫ్ట్ బాక్స్, షాపింగ్ మాల్స్, తదితర విధాలుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఫ్యాక్టరీ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడి చాక్లెట్ల తయారీ విధానం, వినియోగించే ముడి సరుకులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కొబ్బరి పాలు, బెల్లం, కోకో బీన్స్ పదార్థాలు మాత్రమే వినియోగించి చాక్లెట్లు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సీఎం ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మహంకాళఅమ్మ ఎస్ హెచ్ జి గ్రూపు నిర్వాహకరాలు కవురు నవ్యశ్రీ, మండల సమైక్య అధ్యక్షురాలు కె.జయలక్ష్మి, ఏ.పీ.ఎఫ్.పి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, ఏపీ ఈపీడీసీఎల్ సిజిఆర్ఎఫ్ చైర్మన్ పి.సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, ఎంపీడీవో ఎం వి ఎస్ ఎస్ శ్రీనివాస్, స్థానిక నాయకులు జుత్తిగ నాగరాజు, ఎస్ హెచ్ జి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.