మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా బల్పడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండల సమైక్య భవనం నందు నిర్వహిస్తున్న బ్యూటిషన్ కోర్సును పరిశీలించి , బ్యాంకు లింకేజీ, ఉన్నతీకరణపై ఎస్ హెచ్ జి మహిళలకు సర్ఫ్ ద్వారా అందజేస్తున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిఆర్డిఎ, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యూటిషన్ కోర్సును జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం పీఎంఈజిపి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని అందజేయనున్నారని, దీనితో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. జిల్లాలోని ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసి జిల్లా అంతటికి ఒక్కొక్క పథకానికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఇంకొక మండలంలో చెఫ్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బ్యూటిషన్ శిక్షణను నిబద్ధత పూర్తిచేసి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని, మీ కాళ్ళ మీద మీరు స్వయంగా నిలబడే శక్తిని ఆర్థికంగా సంపాదించు కోగలుగుతారన్నారు.
బ్యాంకు లింకేజీ, ఉన్నతీకరణపై ఎస్ హెచ్ జి మహిళలకు సెల్ఫ్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని 4 వేల మందికి అందజేయడం జరుగుతుందని, వారు మండల, గ్రామస్థాయిలో గ్రూపులకు శిక్షణ అందజేస్తారన్నారు. గ్రూపులో ప్రధానంగా బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగంపై గ్రూపుల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. రుణాల ద్వారా పొందిన నగదుతో ఏయే యూనిట్లు స్థాపించవచ్చు, డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి తదితర అంశాలను వివరించాలన్నారు. ప్రధానంగా జీవనోపాధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. ఆడంబరాలకు దూరంగా పొదుపును ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలన్నారు.
సెల్ఫ్ అడిషనల్ డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ సరళ మాట్లాడుతూ పేద మహిళల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం అనేక రుణాలను మంజూరు చేస్తుందన్నారు. వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు కృషి చేయాలన్నారు. పేద మహిళల సమాచారాన్ని సేకరించి జీవనోపాదుల యాప్ నందు పొందుపరచడం జరుగుతుందని, ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసిల్దార్ విజయలక్ష్మి, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.