మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి .. మహిళా రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట వేమవరంలో జరిగిన రెవిన్యూ సదస్సులో పాల్గొని తిరిగివస్తు మార్గం మధ్యలో వీరవాసరం మండలం కొణితవాడ గ్రామంలో కొడి మంగమ్మ మహిళా రైతు రోడ్డు పక్క పొలంలో ధాన్యం పడుతున్న దృశ్యమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చూసి, వాహనము దిగి మహిళా రైతు వద్దకు వెళ్లి మాట్లాడారు. మీకు ఎన్ని ఎకరములు పొలము ఉన్నది, పంట బాగా పండినదా, ఏ వెరైటీ సాగు చేసారు, ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అనే సమాచారాన్ని మహిళ రైతును అడిగి తెలుసుకున్నారు. మీరు పండించిన పంటను రైతు సేవా కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు విక్రయించుకోవాలని అన్నారు. ఒక బస్తాకు కాటా తూకం కి.40.600 గ్రాములు మాత్రమే తూకం వేయాలన్నారు. అంతకుమించి ఒక్క గింజ కూడా ఎక్కువ తూకము వేసి రైతులను నష్టపరచవద్దు అని అన్నారు. మధ్య దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. గోనె సంచులు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచటం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ధాన్యమును రైస్ మిల్లులకు తరలించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం రైతులు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే రైతు సేవా కేంద్రాల ద్వారా సంబంధిత శాఖల అధికారుల ద్వారా తెలుసుకొని కష్టపడి పండించిన ధాన్యమును రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముకుని లాభపడాలని మహిళా రైతు కొడి మంగమ్మ కు, అక్కడకు వచ్చిన పలువురు రైతులకు జిల్లా కలెక్టర్ వివరించారు.