Close

మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని, నేటి యువత వారి స్ఫూర్తితో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 02/10/2025

గురువారం అక్టోబర్ 2 గాంధీజీ జయంతిని పురస్కరించుకొని స్థానిక పాత బస్టాండ్ సెంటర్ బాంబే బేకరీ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ రాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇదే రోజు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అక్టోబర్ రెండో తేదీన గాంధీజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించే సాంప్రదాయం 2007 సంవత్సరం నుండి ప్రారంభమైందన్నారు. ఈ రోజున గాంధీజీ అహింసా సందేశాన్ని అందరికీ చేరవేయడంతో పాటు శాంతి, సహనం పెంపొందించుకోవాలన్న భావనను తెలియజేయాలని ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానించడం జరిగిందన్నారు. గాంధీజీ ఆలోచనలు, భావనలు సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయన్నారు. నేటి యువత కూడా వారి బాటలో అడుగులు వేస్తూ దేశ ప్రగతికి తోడ్పాటు నివ్వాలన్నారు. అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ సత్యాగ్రహం వంటి పోరాటలు చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో “విజయమో వీర స్వర్గమో” అనే గాంధీజీ ఇచ్చిన నినాదంతో యావత్తు దేశ ప్రజలు ముందుకు వచ్చి బ్రిటిష్ వారిని ఎదురొడ్డారన్నారు. నేడు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని వారు ముందుండి నడిపించి సిద్ధింప చేశారన్నారు. సెప్టెంబరు 17వ తేదీ నుండి అక్టోబరు 02వ తేదీ వరకు 15 రోజులు పాటు జిల్లా అంతటా స్వచ్ఛత హి సేవా పేరిట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. భారత దేశం అంతటా బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య నిర్మాణానికి అందరూ కృషి చేయాలాన్నారు. ప్రభుత్వం ఉన్నప్పటికీ, స్వచ్ఛంద సంస్థలు, యువత అందరూ భాగస్వామ్యం అయినప్పుడే పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందన్నారు. మన ఇంటిని, పరిసరాల్లో శుభ్రత విషయంలో మనమే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉండాలని, దానిని అన్ని ప్రాంతాల్లో అమలకు కృషి చేయాలన్నారు.

భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అన్నారు. మహాత్మా గాంధీ జన్మించి 150 ఏళ్ళు పైబడిన ఇంకా స్మరించుకుంటున్నామంటే వారు అహింసా మార్గం ద్వారా ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన సేవలు అనంతం అన్నారు. పరిశుభ్రతపై గాంధీ జీ ఆనాడే చెప్పారన్నారు. ప్రజలు అందరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. దేశ విదేశాల్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మనలోని ఆవేశాన్ని తగ్గించుకోవడానికి గాంధీజీ బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నరు. లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా ఈరోజు కావడం, ఇద్దరు గొప్ప నాయకులు దేశానికి ఎంతో సేవ చేయడం మనమందరం ధన్యులం అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి లోని ధైర్యం , గాంధీజీ సత్యాగ్రమార్గం లలో అందరూ ముందుకు నడవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కె. శ్రీనివాస్, తహసిల్దార్ రావి రాంబాబు, పంచాయతీరాజ్ డిఇ స్వామి నాయుడు, ఏఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు,
పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.