భూ సమస్యల పరిష్కరించడానికి సర్వే పూర్తయిన వాటికి కొత్త పాసు పుస్తకాలు నేటి నుండి పంపిణీ–రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు
రెవిన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి..
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది…
శుక్రవారం కాళ్ల మండలం పెద్దఆమిరం గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన గ్రామసభలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘు రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ముఖ్య అతిథులుగా పాల్గొని 22 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకములను అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు కూటమి ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు నేటి నుండి పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం జనవరి 2 నుండి 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలను పంపిణీ చేయుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకములు మంచి నాణ్యతతో తయారు చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం రైతులందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రెవిన్యూ క్లినిక్ లో రైతుల భూ సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రీ సర్వే భూసేకరణ వంటి వివిధ రకాల భూ సమస్యలను రైతులు రెవెన్యూ కార్యాలయలు చుట్టూ తిరగకుండా ఫిర్యాదులు సేకరించి తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో రెవిన్యూ సమస్యలు పరిష్కరించడానికి రెవిన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియకు నేటి నుండి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా రీ సర్వే పూర్తి అయిన 110 గ్రామాలలో 62.398 వేల పట్టాదారు పాస్ పుస్తకాలు అందాయని, వాటిలో క్షుణ్ణంగా పరిశీలించి 59 వేల పట్టాదారు పాసుపుస్తకాలను గ్రామసభలు నిర్వహించి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకములు రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో ఈరోజు గ్రామ సభ ద్వారా కొత్తగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకములను రైతులకు పంపిణీ ప్రారంభించడం జరిగింది అన్నారు. రైతులుకి అందజేసిన పాసు పుస్తకములలో ఏమైనా పొరపాట్లు ఉంటే రెవిన్యూ టీంకు తెలియజేయాలని అన్నారు. రెవిన్యూ సమస్యలు ఏమన్నా ఉంటే సమగ్రముగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు సమస్య పరిష్కారం కొరకు రెవిన్యూ క్లినిక్ లో పెట్టి అర్జీలపై సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుంది, ఏ విధంగా పరిష్కారం అవుతుంది అర్జీదారునికి తెలియజేయడం జరుగుతుందన్నారు. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు అని ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా టైం టు టైం చూచి ఏ మండలము, ఏ గ్రామము, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, అధికారులు పనితీరు ఎలా ఉంది? నోటీసులు ఇస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వెబ్ ల్యాండ్ డేటాతో క్షుణ్ణంగా ధృవీకరించిన తరువాత అర్హులైన పట్టాదారులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలు తలెత్తితే వాటిని నమోదు చేసుకుని తెలియజేస్తే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ గ్రామాలకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణిత వేదికల వద్దకు వచ్చి పాసు పుస్తకాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ సుందర్ సింగ్, గ్రామ సర్పంచ్ ఏం.సోమేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు జవాద్ కిషోర్, తోట పాణి బాబు, కొండా రామ్మూర్తి, కటారి వెంకట నరసింహరాజు, వీఆర్వో కుమార్, సెక్రటరీ నాగేంద్ర కుమార్, రైతులు, తదితరులు ఉన్నారు.