Close

భీమవరం రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు త్వరలో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటు చేసి చికిత్సను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 28/04/2025

సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సేవలకు గోల్డ్ మెడల్ ను సాధించడం అభినందనీయమని, దీనికి కృషి చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అభినందనీయులన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. మే 8న రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవలను గుర్తించి గోల్డ్ మెడల్ కు ఎంపిక చేయడం జరుగుతుంది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లా 2022-23 నుండి 2024-25 వరకు వరుసగా మూడు సంవత్సరాలపాటు గోల్డ్ మెడల్ ను సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర గవర్నర్ మే 28న భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు తలసేమియా పిల్లలకు తల సేమియా సెంటర్ ఏర్పాటుకు ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఐ ఆర్ సి ఎస్ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ ఎం ఎస్ వి ఎస్ బద్రి రాజు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

1.11