భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకును డిసెంబర్ 20న ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Publish Date : 19/12/2024
సుశేణా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇతర ముఖ్య భాగస్వాముల సహకారంతో తల్లిపాల బ్యాంకును భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి సుశేణా హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి స్టేట్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ లక్కర్సు, డిసిహెచ్ఎస్ డాక్టర్ సూర్యనారాయణ అందజేశారు.
తల్లులకు సమగ్ర లాక్టేషన్ మద్దతు అందించడానికి, శిశువులకు అత్యుత్తమ పోషణను నిర్ధారించడానికై ఏర్పాటు చేయబడిందన్నారు. తల్లిపాలపై సలహా, పాల దానం, లాక్టేషన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ప్రయోజనంగా ఉంటుందని సుశేణా హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి స్టేట్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ లక్కర్సు తెలిపారు.