Close

“భీమవరం అక్టోబర్ 14 నుండి సూపర్ జిఎస్టి బెన్ఫిట్ బజార్”–జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 13/10/2025

సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 14న జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించవలసిన ప్రత్యేక కార్యక్రమాలు, “భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ ” నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ చాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం నియోజకవర్గాల స్థాయిలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, స్టేషనరీ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణల ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలపై ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి విజయవంతం చేయాలన్నారు. అలాగే రేపు అక్టోబర్ 14 నుండి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఆటోమొబైల్స్, ద్విచక్ర వాహనాలు, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, జ్యువలరీ, లేసు ఉత్పత్తులు, గృహోపకరణాలు, మెడిసిన్స్, సోలార్ ఉత్పత్తులు, ఇన్సూరెన్స్, ఫుడ్ ఐటమ్స్ వంటి 25 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు ఎంత మేరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో తెలిసేలా రేట్లను ప్రదర్శించాలన్నారు. ఈ స్టాల్స్ ద్వారా వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు లభించేలా చూడాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక డిస్కౌంట్ ల ద్వారా అమ్మకాలు పెరుగుతాయి అన్నారు. దీపావళికి ముందు ఈ ఉత్సవం నిర్వహించడం ద్వారా పన్ను సంస్కరణలపై ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందన్నారు. వినియోగదారులకు పండుగ సీజన్ డిస్కౌంట్లు, కాంబో ఆఫర్‌లు, బోనాంజాలు కూపన్లు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సాయంత్రం సాంస్కృతిక, వినోదం కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే పిల్లల ప్లే జోన్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు కూడా ఉంటుందన్నారు. భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ ను అన్ని శాఖల అధికారులు, వ్యాపార ప్రతినిధులు, వినియోగదారులు విజయవంతానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. జీఎస్టీ బెనిఫిట్ బజార్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు, త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని సంబంధించిన శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ గూగుల్ మీట్లో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.