భీమవరంలో నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్…
లబ్ధిదారులను ఆప్యాయతగా పలకరిస్తూ మాటామంతి …
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి…
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
భీమవరం పట్నం 6వ వార్డు బొక్కావారిపాలెంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి లబ్ధిదారులను ఆప్యాయతగా పలకరించి సమయానికి పింఛన్ అందుతుందా, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న పింఛన్ల మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచడంతోపాటు, నిర్ణీత తేదీలలోనే అందించడం మీరందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. పెద్దవారు, దివ్యాంగులు, వితంతువులు వారి అవసరాల నిమిత్తం డబ్బు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం నెలలో మొదటి తేదీ సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.