Close

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఫిబ్రవరి 27న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 24/02/2026

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 27వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 21 ప్రముఖ కంపెనీలతో పాటు, మరికొన్ని ఇతర కంపెనీలలో ఉద్యోగఅవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వివిధ కంపెనీలలో మొత్తం 2 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, 18 – 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ నందు https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, ఇతర వివరములకు ఈ క్రింది నెంబర్ల నందు 9492885556 సంప్రదించాలనన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్, NCS Y.P కిషోర్ రెడ్డి , ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ అనురాధ , ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.