Close

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను అంచనాలు వేసి సత్వరమే నివేదిక అందించాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

Publish Date : 10/09/2024

మంగళవారం భీమవరం మండలంలోని చినఅమిరం, యల్.వి.యన్.పురం గ్రామాలలో జిల్లా జాయింటు కలెక్టరు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటమునిగి దెబ్బతిన్న వరి పొలాలను సంబంధిత శాఖలు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. జరిగిన పంట నష్టాలను ప్రభుత్వం అందించిన ఫార్మేట్ లో పూర్తి సమాచారాన్ని పొందుపరిచి నివేదికను జిల్లా కార్యాలయంకు అందించాలన్నారు. విలేజి అగ్రికల్చర్ అసిస్టెంట్, విఆర్వో, పంచాయతీ కార్యదర్శి ప్రక్రియలో భాగస్వాములై క్షేత్రస్థాయిలోకి రైతులతో కలిసి వెళ్లి డేటా కాలము 34లో నమోదు చేసి నివేదికను అందించాలన్నారు. నష్టాలు అంచనాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కచ్చితంగా అంచనాలను తయారు చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు ఆదేశించారు.

ఎల్.వి.ఎన్ పురం బొండాడ డ్రైన్, ఓల్డ్ యనమదుర్రు డ్రైన్ ను పరిశీలించిన:జిల్లా జాయింటు కలెక్టరు .

పల్లిపాలెం బ్రిడ్జి వద్ద కిక్కిసతో నిండియున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యనమదుర్రు డ్రైను వరద మొదటి ప్రమాద సూచికలో నడుస్తున్న కారణంగా, రెండవ ప్రమాద సూచిక జారీకాక ముందే యుద్ధ ప్రాతిపదికన అవసరమైన ముందస్తు చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. కిక్కీస తొలగింపు, డ్రైన్ పూడిక పనుల ప్రతిపాదనలను తక్షణమే అందించాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.

జిల్లా జాయింటు కలెక్టరు వెంట తహాశీల్దారు రావి రాంబాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాసు, మండల వ్యవసాయ శాఖ అధికారి యన్.శ్రీనివాసు, జలవనరుల శాఖ సహాయక ఇంజనీరు ఏ.వి. వెంకటేశ్వరరావు, విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ సాయి, సర్వేర్ ఈశ్వర్, వీఆర్వో శ్రీనివాస్, రైతులు వెంకట్ రాజు, రుద్రరాజు శ్రీనివాస్, రంగారావు, పాల కోటయ్య పురుషోత్తం రాజు, తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.