భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాక్ అసెంబ్లీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులుగా అద్భుత ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థిని, విద్యార్థులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నుండి ఏడు నియోజకవర్గాల నుండి ఒక్కొక్క విద్యార్థి ప్రజాప్రతినిధిగా హాజరై అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి వినూత్న కార్యక్రమం మునిపెన్నడూ జరగలేదన్నారు. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థులకు చట్టసభలలో బిల్లులు ఎలా పాస్ చేస్తారు, జీరో అవర్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా ఆమోదిస్తారు తదితర విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కలిగిందన్నారు. మన జిల్లా నుండి ఆచంట నియోజకవర్గం ఎస్ ఎమ్ బి టి ఆర్ జెడ్ పి హెచ్ ఎస్ కోడెల్లి సరిత, పాలకొల్లు నియోజకవర్గం మేడపాడు జడ్పీహెచ్ఎస్ స్కూల్ వి.శ్రీహర్షిణి, నరసాపురం నియోజకవర్గం జడ్పీహెచ్ స్కూల్ పి.గుణ శివరామకుమార్, భీమవరం నియోజకవర్గం రాయకుదురు జడ్పీహెచ్ఎస్ వై.జోయసి, ఉండి మండలం పెన్నాడ జడ్పీహెచ్ఎస్ జి.సత్య, తణుకు నియోజకవర్గం రేలంగి టీఎంజెడ్పి స్కూల్ మరి శెట్టి మహాలక్ష్మి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం దర్శిపర్రు జడ్పీ హైస్కూల్ పంతం గాయత్రి దుర్గ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కస్ప పెంటపాడు జడ్.పి.హెచ్.ఎస్ సింగులూరి కోమలి సత్యశ్రీ (రిజర్వ్) మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది. వీరికి సోమవారం పి జి ఆర్ ఎస్ హాల్ నందు మెమోటో, మెడల్ బహుకరించి జిల్లా కలెక్టర్ అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, ఏపీసి పి.శ్యాంసుందర్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.