భక్తులు సేవే భగవంతుని సేవగా భావించాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలన, అధికారులతో సమీక్ష
ఆలయ పరిసరాలు సుందరంగా కనిపించాలి
ఆలయానికి కిలోమీటరు దూరం వరకు ఆధ్యాత్మిక భావం కనిపించేలా ఏర్పాటు చేయాలి
దాతలు ఇచ్చిన ప్రసాదాలు, అన్నదానం భక్తులు స్వీకరించేందుకు తగిన ఏర్పాటు చేయాలి అధికారులు ఆదేశాలు
పంచారామ క్షేత్రాలు ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ప్రసిద్ధి చెందిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించారు. తొలుత ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించి స్వామివారి చిత్రపటాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి బహుకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆలయ ఈవో ఛాంబర్ నందు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి భక్తులకు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఆలయ పరిసరాలు సుందరంగా కనిపించాలని అన్నారు. ఆలయానికి కిలోమీటర్ దూరం వరకు ఆధ్యాత్మిక భావం కనిపించేలా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. దాతలు అందజేసిన అన్న, ప్రసాదాలు భక్తులు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, దర్శనం మార్గాలు, ప్రసాదం పంపిణీ కేంద్రాలు, త్రాగునీటి సదుపాయం, శానిటేషన్, వైద్య శిబిరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు, రాత్రి సమయాల్లో ఎటువంటి విద్యుత్ అవరోధం లేకుండా జనరేటర్ ఏర్పాటు, విద్యుత్ అలంకరణ తదితర అంశాలను చేయాలని అధికారులను ఆదేశించారు. భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్లకు ఇరువైపులా షాపులు, ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు భద్రతకు సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, శ్రద్ధతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ముందుగా పాలకొల్లు మండలం శివ దేవుని చిక్కాల శివ దేవ స్వామి ఆలయంను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆలయ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివరాత్రి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ డా. శ్రీ వేద, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, తహసీల్దార్ వై.దుర్గా కిషోర్ మున్సిపల్ కమిషనర్ విజయ సారధి, ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ మీసాల రాము, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
