Close

బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, గృహానిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భీమవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు.

Publish Date : 21/05/2025

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది.

భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి సేవల భేష్.

అంగన్వాడి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం పై మరింత శ్రద్ధ చూపాలి.

చౌక డిపోల ద్వారా పేదలకు నిత్యవసర వస్తువులు సకాలంలో అందించాలి.

రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్…

ఈ సందర్భంగా భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి, గునుపూడి ఇందిరా గాంధీ పురపాలక సంఘం ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రం, నాచు వారి సెంటర్లో ప్రభుత్వ చౌక డిపో దుకాణమును అజయ్ జైన్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సందర్శించారు.

తొలుత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఓపిలో రిజిస్టర్లను పరిశీలించారు. రోజుకు ఎంతమంది పేషెంట్లు వస్తుంటారు అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను అందిస్తున్న అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు మరియు మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెండు, మూడు జిల్లాలకు ఒక సీనియరు ఐఏయస్ అధికారిని నియమించడం జరిగిందని, దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాను ప్రత్యేక అధికారిగా పర్యటించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, చౌక ధరల దుకాణాలు, ధాన్యం సేకరణ, తదితర పథకాలు నిర్వహణ ఏ విధంగా ఉన్నవి, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉన్నాయా తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మేరకు మందులు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రికి సంబంధించిన నిధులు సంతృప్తి కరంగా ఉన్నాయని, ఎక్కడ ఏటువంటి లోటు లేకుండా రోగులకు సేవలు అందుతున్నాయి అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో మరో నూతన భవనం నిర్మాణంలో ఉందని దానికి సంబంధించి ఏమైనా అదనంగా నిధులు అవసర మైతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు.

అంగన్వాడి కేంద్రం పరిశీలన.

పట్టణంలో గునుపూడిలో ఇందిరా గాంధీ పురపాలక సంఘం ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రము పనితీరును పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు పిల్లలకు పౌష్టికాహారం లోపము లేకుండా చూడాలన్నారు. చిన్నారుల హాజరపట్టిని పరిశీలించారు. పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అని ఆరా తీసి బరువును తూయించి పరిశీలించారు. అంగన్వాడి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం పై మరింత శ్రద్ధ చూపాలని అన్నారు.

ప్రభుత్వ చౌక డిపో దుకాణము తనిఖీ.

భీమవరం పట్టణంలో నాచువారి సెంటర్ నిర్వహిస్తున్న ప్రభుత్వ చౌక డిపో నెంబరు 18 పరిశీలించారు. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా అందించే సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులను సకాలంలో అందించాలని చౌక డిపో డీలర్ ను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాతారాణి, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, జిల్లా టూరిజం అధికారి ఏ.వి. అప్పారావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి పిడి జి.పిచ్చియ్య, ఇఇ బి.వెంకట రమణ, డియస్ వో యన్.సరోజ, తహశీల్దారు రావి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

5.11 5.22

 

 

 

 

 

 

 

 

 

 

5.33