బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని ఉన్న 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లులో మరఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హమాలీలను సమకూర్చుకొని బియ్యం దిగుమతి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. గిడ్డంగుల నిర్వహణలో ఏటువంటి అవకతవకలు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు పంపవలసిన బియ్యాన్ని సకాలంలో సక్రమంగా సరఫరా చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గిడ్డంగులన్నీ రాష్ట్ర ఎస్ డబ్ల్యూ ఎస్ సి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నిర్వహించాలన్నారు. ఎస్ డబ్ల్యూ సి రీజినల్ మేనేజర్ ను జిల్లాలోని సంబంధిత 9 గిడ్డంకులు ఇన్వెస్టింగ్ గిడ్డంగులు వారితో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహణను భద్రతా ప్రమాణాలను అనుగుణంగా చేపట్టాలని రీజనల్ మేనేజర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎం సివిల్ సప్లై అధికారి టి.శివరామ ప్రసాద్, రీజనల్ మేనేజర్ జి.భాను మూర్తి, గిడ్డంగుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.