Close

బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Publish Date : 09/09/2024

సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి మార్కెటింగ్, సివిల్ సప్లైస్, బియ్యం, కందిపప్పు హోల్ సేల్ అసోసియేషన్ తో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు దృష్టికి వచ్చినట్లు తెలిపారు. హోల్ సేల్ రేట్లకే అన్ని షాపుల్లో ఒకే విధమైన ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత నెల రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను అందుబాటు ధరల్లో విక్రయించేలా చూడాలన్నారు. రానున్న రెండు రోజుల్లో అమ్మకం ధరల్లో తప్పకుండా మార్పు రావాలని లేని పక్షంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కె. సునీల్ కుమార్, భీమవరం రైతు బజార్ ఎస్టేట్ అధికారి పి.కళ్యాణ్, డీఎస్ఓ ఏన్.సరోజ, సిపిఓ ఎం.మోహన్ రావు, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లాలోని బియ్యం, కందిపప్పు హోల్ సేలర్స్ అసోసియేషన్స్, తదితరులు పాల్గొన్నారు.