• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి–జిల్లా

Publish Date : 07/07/2025

వర్షాకాలం సీజన్ లో అధిక వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి..

రానున్న మూడు రోజులు భారీ వర్షాలకు సూచన..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అధికార యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలి..

విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ ప్రసారం కారణంగా ఏ ఒక్కరు మరణించిన ఉపేక్షించేది లేదు..

గత సంవత్సరకాలంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతం ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

సోమవారం కలెక్టరేట్ టీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వర్షాకాలం సీజన్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సరం అధిక వర్షాలు, వరదలు కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతం గట్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ఇసుక బస్తాలు, సరుగుడు బాదులు సిద్ధంగా ఉంచాలన్నారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలోని షెల్టర్లను మరమ్మత్తులు చేయించి సిద్ధం చేయాలన్నారు. రహదారులు భవనాలు శాఖ బలహీనంగా ఉన్న బ్రిడ్జిలు, రోడ్డు మార్గాలు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని 35 చౌక ధరల దుకాణాల్లో నిత్యాసర వస్తువులను ముందస్తుగా నిల్వ ఉంచాలన్నారు. అలాగే పెట్రోలు, డీజీలు, ఎల్పిజి నిల్వలను పర్యవేక్షించాలన్నారు. జిల్లా ఆరోగ్యశాఖ గర్భిణీలను, వృద్ధులను, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారిని ముందస్తుగా గుర్తించి జాబితాను సిద్ధం చేయాలన్నారు. అవసరమైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు మార్కెట్ లు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా నిర్వహించాలని, త్రాగునీటి పైప్ లైన్ లు లీకేజ్ కారణంగా కలుషితం కాకుండా మర్మత్తులు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, వేలాడే విద్యుత్ తీగలను ముందుగానే సరిచేయాలని ఆదేశించారు. ఏ ఒక్కరూ విద్యుత్ షాక్ కారణంగా చనిపోయిన సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లంక గ్రామాల్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని డిఆర్ఓ కు సూచించారు. అధిక వర్షాలు, వరదలు టైంలో బోట్లు తిరగడం, ఘాట్ లోనికి ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టం చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ బోట్లు, లైఫ్ జాకెట్లు, నిల్వ ఉన్న నీటిని తోడేందుకు మోటార్ ఇంజన్లను సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యాశాఖ అధిక వర్షాలు, వరదలు కారణంగా పాఠశాలలకు వెళ్లడానికి వీలులేని ప్రాంతాలలో సమయానుకూలంగా పాఠశాలకు సెలవును ప్రకటించాలని సూచించారు. వాతావరణ శాఖ జిల్లాకు రానున్న మూడు రోజులలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిపిఓ, డిఎవో, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, అగ్నిమాపక, వైద్య, విద్యా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.