ఫేస్ -1, ఫేస్ -2 రీసర్వే నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి– జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం రీసర్వే, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్.పి.ఎంలు ప్రగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేస్ వన్-1 లో పూర్తి కావాల్సిన ఐదు గ్రామాలలో రీ సర్వే పనులను వచ్చే శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేస్-2లో జరుగుతున్న 27 గ్రామాలకు సంబంధించి ప్రతి భూస్వామికి 9(2) నోటీసు అందించాలన్నారు. ఇంకను రీసర్వే చేయవలసిన 72 గ్రామాల గ్రామ సరిహద్దులను రెండు రోజుల్లోగా నిర్ధారించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వ భూములకు ముందుగా గుర్తించాలన్నారు. భూమి సరిహద్దు సమస్య దరఖాస్తులు, ఆన్లైన్ సబ్ డివిజన్ దరఖాస్తులు, పిజిఆర్ఎస్ లో అందిన దరఖాస్తుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జాయింట్ ఎల్పిఎం సేవ రుసుము 500 రూపాయలను రద్దు చేయడం జరిగిందని, జాయింట్ ఎల్ పి ఎంలు కలిగిన రైతులు అందరికీ ఈ విషయాన్ని తెలియపరచి వెంటనే వారితో జాయింట్ ఎల్పిఎం దరఖాస్తులు తీసుకోవాలన్నారు. వచ్చే వారంలోగా సమస్యల పరిష్కారంపై ప్రగతి చూపించని వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, తహసిల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.