ఫేజ్ -1,2,3 రీ సర్వేకు సంబంధించి రైతుల పూర్తి సమాచారాన్ని సత్వరమే వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలి–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
ఫిబ్రవరి 2 నుండి 9 వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి.
ఆక్వా రైతుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి.
కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం అప్సడా రిజిస్ట్రేషన్స్, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రీ సర్వే అంశాలపై ఆర్డీవోలు, తహాసిల్దార్లు, ఎఫ్.డి.ఓలు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు పంపిణీ చేసే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో చిన్న తప్పు కూడా దొర్లకొండ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ సమయంలో ప్రతి రైతుతో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు అన్నీ సంతృప్తికరంగా ఉన్నది, లేనిది తెలుసుకోవాలన్నారు. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయు 12 గ్రామాలలో రైతులు పూర్తి సమాచారాన్ని సేకరించే కార్యక్రమాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకను 40 వేల ఎకరాల ఆక్వా రైతులు అప్సడా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉందని ఫిబ్రవరి 10వ తేదీ నాటికీ అప్సడా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉంటే రెవిన్యూ, మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కార చర్యలు తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫేజ్ -1,2,3 రీసర్వేలకు సంబంధించి రైతుల పూర్తి సమాచారాన్ని సత్వరమే వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే రికార్డును వెబ్సైట్లో పొందుపరచడం వల్ల రైతులందరూ వాటిని సరిచూసుకోవడం జరుగుతుందన్నారు. ఫేజ్ -4 సర్వే త్వరితిగతన పూర్తి చేసి రైతుల రికార్డులను అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం మరింత సమయస్తూ ఇచ్చిన కొత్త జీవో ప్రకారం అన్ని పనులు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తహసిల్దార్లను ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవోలు దాసిరాజు, ఖతిబ్ కౌసర్ భానో, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కే.జాషువా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.