Close

ప్రభుత్వ పథకాల ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 20/06/2025

జిల్లాలో రీ సర్వే పూర్తికాబడిన గ్రామాలలో జాయింట్ ఎల్.పి.ఎం ల కారణంగా ప్రభుత్వ పథకాలను పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో రీసర్వే పూర్తి కాబడిన గ్రామాలలో జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన రైతులు అన్నదాత సుఖీభవ”, “తల్లికి వందనం” మొదలైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ ను చేపట్టినదని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ శాఖ సబ్ డివిజన్ సేవ కొరకు నిర్ధారించిన రూ.500/-లు రుసుముకు మినహాయింపు ఇచ్చి కేవలం నామ మాత్రపు ధరఖాస్తు రుసుము రూ.50/- లను చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిర్ణీత రుసుమును సంబందిత గ్రామ సచివాలయములో చెల్లించిన యెడల జాయింట్ పట్టాదారుల భూములను ఉచితముగా నబ్ డివిజన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సదుపాయము జూన్ 30 లోపుగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కావున, జాయింట్ పట్టాదారులుగా నమోదుకాబడిన రైతులు సబ్ డివిజన్ పొందుటకు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.