Close

ప్రభుత్వం రాజ ముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 07/02/2026

పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి.

తణుకు మండలం తేతలి గ్రామ పంచాయతీ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నది, లేనిది చూసుకున్నారా, లేదా అడిగి తెలుసుకున్నారు. అన్ని సక్రమంగానే ఉన్నాయని, రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి బయట ఉన్న రైతులకు ఫోన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏకీకృత కుటుంబ సర్వే ఏ విధంగా జరుగుతున్నది పరిశీలించి సర్వే , ఈ కేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంలో ఆర్డిఓ ఖైతిబ్ కైసర్ భానో, తణుకు తహసిల్దార్ డి.అశోక్ వర్మ, ఎంపీడీవో లోహిత్ సాగర్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.