ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
పశువులు రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయి..
పాడి, పసుపు నానుడికి అర్థంగా ప్రతి ఒక్క రైతు కనీసం ఒక ఆవు, గేదె పెంచాలి..
పశ్చిమగోదావరి జిల్లాలో నానాటికి తరిగిపోతున్న పశుసంపదను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పశువులు కలిగి ఉంటే అన్ని కాలాల్లో ఆదాయం ఉన్నట్టే
పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ మరియు అగర్తిపాలెంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. తొలుత గోమాతకు పూజ చేసి నమస్కరించారు. గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, దూడల అందాల పోటీ శిబిరాలను, ఉచితంగా అందించే మందులు, పరీక్షలు కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్ ను స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సొంతంగా పాడిచేసి పాలు తాగడం వలన ఆరోగ్యంగా ఉంటారని, కల్తీ పాలపై నిత్యం వార్తలను వింటున్నామని, అవి క్యాన్సర్ కూడా కారణం అవుతున్నాయి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పశుగణాభివృద్ధి గణనీయంగా తగ్గుతుందని, రైతుకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే తగినంత ఆర్థిక అభివృద్ధి ఉంటుందన్నారు. పాడి పంటలు అనేది ఎప్పటినుండో రైతులతో మమేకమైనదని పంటల నుండి పాడిని విడదీయరానిదన్నారు. ప్రతి ఇంటి ముందు ఆవు, గేదె ఏదో ఒకటి పెంచుకోవాలని సూచించారు. పశువుల సంరక్షణ ద్వారా ఆదాయం పొందాలని, చూడకురాని పశువులను సమయానికి వైద్య పరీక్షలు చేయించి మేలు పొందాలన్నారు. ప్రభుత్వం పశువైద్యశాలలో పశువులకు కావాల్సిన పరీక్షలు చేయించి వైద్యుల సలహా మేరకు చికిత్సలు చేయించాలని సూచించారు. పశు వైద్యులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా శిక్షణను అందించాలని జిల్లా పశువైద్య శాఖ అధికారికి సూచించారు. పశువైద్య శిబిరం సందర్శన ద్వారా నేడు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్వస్థలాన్ని చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారికి కూడా పాడిపంటలు అంటే చాలా ఇష్టమని, వారు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న ఫోటోలను కూడా నేను చూశానని ఈ సందర్భంగా తెలిపారు. 2020 సంవత్సరంలో విడుదల చేసిన పశుగణాభివృద్ధి లెక్కల ప్రకారం పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో 4,908 ఆవులు, 14,033 గేదెలు, 3,144 గొర్రెలు, 2,586 మేకలు, 58,796 పెరటి కోళ్లు, 61,000 పౌల్ట్రీ ఫారం కోళ్లు ఉన్నాయని తెలిపారు. జనవరి 19 నుండి జనవరి 30 వరకు 59 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 1,182 పశువులకు చికిత్స చేయడం జరిగిందని, అలాగే 2,439 పశువులకు నట్టల నివారణ ముందును అందజేయడం జరిగింది అన్నారు. ఈరోజు నిర్వహించిన దూడల అందాల పోటీలలో గెలుపొందిన దూడల రైతులకు ఏపీ లైవ్ స్టాక్ ఏజెన్సీ సౌజన్యంతో పాలక్యాను, దబేరా, బలవర్ధకమైన టానిక్ ను బహుమతిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కోటి లింగరాజు, డిప్యూటీ డైరెక్టర్లు జవ్వార్ హుస్సేన్, ఎల్.కె సుధాకర్, మంత్ర నాయక్, జి.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.సుమ, తహసిల్దార్ వై.కృష్ణ కిషోర్, సర్పంచ్ కావలి లక్ష్మీకుమారి, ఏఎంసీ చైర్మన్ కె.విజయభాస్కర్, పి ఎస్ సి ఎస్ చైర్మన్ జాన్ రాజ్, స్థానిక నాయకులు పాముల రజిని, పలువురు జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఏహెచ్ఏలు, తదితరులు పాల్గొన్నారు.