ప్రపంచ నాగరికత వ్యవసాయంతోనే ప్రారంభమైందని, వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు.
రైతులకు పంట సాగులో లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది..
క్రిసాన్ డోన్స్ 80% సబ్సిడీపై జిల్లాలో40 గ్రూపులకు రూ.3.14 కోట్లు విడుదల..
709 సన్న, చిన్న కారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు రాయితీపై సరఫరాకు రూ.3.84 కోట్లు విడుదల..
బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన “వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ” సబ్సిడీ విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచ నాగరికత వ్యవసాయంతోనే ప్రారంభమైందని, రైతులు చేతుల మీదుగా ప్రతి పౌరునికి ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. ఒకనాడు ఆహార కొరత స్థాయి నుండి రైతులు విప్లమాత్మకమైన సాగు ద్వారా మిగులు ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క రైతుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నూతన సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని, అలాగే డ్రోన్లను విరివిగా వాడాలని సూచించారు. డ్రోన్లు కలిగిన రైతులకు ప్రజలు, రైతులు సహకరించి ప్రయోజనాన్ని చేకూర్చాలన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోన్స్ పేరిట గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 40 డ్రోన్స్ లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యానికి మించి 41 డ్రోన్లను కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే 15 డ్రోన్స్ ను రైతులకు అందజేయడంతో పాటు సబ్సిడీ మొత్తాన్ని కూడా రైతులు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రానున్న 15 రోజుల్లో మిగతా డ్రోన్లు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. జూలై 15 లోపుగా ఎన్ని డ్రోన్లు కావలసిన రైతులకు సబ్సిడీపై అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే 2024 – 25 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 709 మంది సన్న, చిన్న కారు రైతులకు రూ.8.99 కోట్ల విలువ కలిగిన వ్యక్తిగత యంత్ర పరికరాలను రూ.3.84 కోట్ల. రాయితీపై పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీటిలో 83 “ట్రాక్టర్ తో నడిచే యంత్ర పరికరాలు, 54 రోటవేటర్లు, 157 బాటరీ స్ప్రేయర్లు,78 పవర్ స్ప్రేయర్లు, 4 పవర్ వీడర్లు, 4 బ్రష్ కట్టర్లు, 329 పవర్ టిల్లర్లు ఉన్నాయని, వీటిని రైతులు ఇంటి వద్దనే అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు రైతులను యంత్ర సామాగ్రిని అందచేయడంపై ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో వ్యవసాయ పరికరాలు గ్రూపు సభ్యులకు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు వ్యక్తిగతంగా ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉందన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ కి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వ్యవసాయ పరికరాలను కచ్చితంగా వినియోగించుకోవాలన్నారు. యంత్ర పరికరాల వినియోగంతో ఉత్పత్తి పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ, కే శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, అనిల్ కుమారి, రమేష్, రాఘవేంద్రరావు, ఏవో రాధిక ప్రియదర్శిని, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.