Close

ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దయ, ప్రేమ, శాంతి, సేవా గుణాలను నేర్పించిన త్యాగమూర్తి ఏసుప్రభువు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 20/12/2025

భీమవరం బీవీ రాజు కళాశాల మినీ ఆడిటోరియం నందు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రేమ మూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు క్షమా గుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం అన్నారు. ఏసు ప్రభువు జన్మదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటామన్నారు. ఆ రోజుకు నెలరోజులు ముందు నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రార్థనలు జరుపుకుంటున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా వేడుకలు అందరము కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తాను కూడా చర్చికి వెళతానన్నారు. ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమన్నారు. క్రిస్మస్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ప్రజల కొరకు వచ్చిన ఏసుక్రీస్తు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు. ఆయనను గుర్తు చేసుకోవటమే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రపంచ దేశాలన్ని క్రిస్మస్ పండుగను గొప్ప వేడుకగా జరుపుకుంటారని వివరించారు. జిల్లా ప్రజలు ఆనందంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా ప్రజలంతా శాంతి, సమాధానాలతో కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని కోరారు.

క్రిస్మస్ పండుగ సంతోషాన్ని అందరిలో నింపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రైస్తవ సోదరులంతా సమాధానంతో పండుగను వేడుకగా జరుపుకోవాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ పెద్దలు, పాస్టర్లకు పంచిపెట్టారు. అనంతరం కొవ్వొత్తులతో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ అధికారి కె. ఎస్ ప్రభాకరరావు, పర్యవేక్షకులు మూర్తి, విషప్ రెవరెండ్ పి జయ రావు, రెవరెండ్ దామన్ కుమార్, పాస్టర్ శామ్యూల్ విష్ణు కాలేజ్ శ్రీనివాస్ వర్మ, పాస్టర్లు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.