ప్రధానమంత్రి “ఫసల్ బీమా యోజన” ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు ఏఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖరీఫ్ 2025 సంబంధించి పంట నష్టాల వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను ఆదుకొనుటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రెవిన్యూ, వ్యవసాయం, హార్టికల్చర్ సహకార శాఖలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏ సి ఐ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట నష్టాల వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను ఆదు కొనుటకు గాను ఖరీఫ్ 2025 కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తుందని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా వరదలు, భారీ వర్షాల కారణంగా ఎక్కువ మంది రైతులు పంట నష్టాన్ని సవిచూచారన్నారు. గత సంవత్సరం పరిస్థితి పునరావృతం కాకుండా నూరు శాతం రైతులు ఫసల్ బీమా యోజన పథకంలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని 100 ఎకరాలు పరిధిలో సరాసరి ఏడు సంవత్సరాల దిగుబడిలో ఐదు సంవత్సరాల యావరేజ్ని పరిగణలో తీసుకొని భీమా నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది అన్నారు. దీనికి సంబంధించి బీమా మొత్తం ఎకరాకు రూ.42 వేలు వర్తిస్తుందన్నారు. ప్రీమియం రూ.210/- లు ఎకరాకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 15 ఆఖరు తేదీగా ఉందని తెలిపారు. బ్యాంకు ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు, వ్యవసాయ రుణం పొందిన వారు మీ యొక్క బ్యాంకు శాఖ ద్వారా బీమాను పొందవచ్చు అన్నారు. రుణం పొందిన వారు దగ్గరలో ఉన్న బ్యాంకుకు గాని, కామన్ సర్వీస్ సెంటర్ కు గాని, బీమా కంపెనీ ద్వారా నిర్మించబడిన మధ్యవర్తుల ద్వారా గాని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్ నందు గాని, మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా భీమాను పొందవచ్చు అన్నారు. దీనికి వ్యవసాయ భూమి కలిగిన రైతులు మరియు కౌలుదారులు ఈ పథకానికి అర్హులు అన్నారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టేలా అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ లను ఆదేశించారు. ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలనే ప్రతి ఒక్క రైతు ఈ పంటలో తప్పనిసరిగా నమోదయి ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవరు నష్టపోకుండా సిసిఆర్సి క్రాఫ్ లోని వారి అందరికీ ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రతి ఆర్ ఎస్ కె, తహాసిల్దార్, అగ్రికల్చర్, బ్యాంకులు, సొసైటీలు కార్యాలయాలు వద్ద అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఉంచాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రీమియం కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఎల్ డి ఎం నాగేంద్ర ప్రసాద్, సిపిఓ కంటిపూడి శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవేంద్ర కుమార్, ఏఐసి కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కే సంపత్ కుమార్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఎం ఏ ఓలు, బ్యాంకర్స్ తదితరులు పాల్గొన్నారు.