Close

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 02/01/2026

జిల్లాలో జనవరి 1వ తేదీ నుండి నుండి 31 వరకు జాతీయ రోడ్ భద్రత మాసోత్సవం నిర్వహణ.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు.

జాతీయ రహదారి భద్రత మాసోత్సవం 2026, సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా రోడ్డు భద్రత గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈనెల 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన” అనే నినాదం తో పశ్చిమ గోదావరి జిల్లా అంతటా, పోలీస్, ఆర్ & బి, పంచాయతీ రాజ్, మునిసిపల్, మెడికల్ & హెల్త్, నేషనల్ హైవే స్ హైవేస్ శాఖల సమన్వయంతో రహదారి భద్రత మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రతపై అవగాహనా సదస్సులు, ర్యాలీలు, వర్క్ షాప్ లు, విద్యార్థులకు క్విజ్ లు, మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించబడింది.స్కూల్ బస్సు, వివిధ క్లాస్ అఫ్ వెహికల్ గల వాహన చోదకులకు శిక్షణ ఇవ్వడం, కాలేజీ ప్రజలతో WALKATHON వంటి కార్యక్రమములు చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె. ఎస్ ఎం వి కృష్ణ రావు ,మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కె. ఎస్.యెన్ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, ఎం.రవి కుమార్, ఎస్ వి వి సత్యనారాయణ, పీ నరేంద్ర బాబు, ఏ సత్య ఫణి తేజ, తదితరులు ఉన్నారు.