ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో అందిన ఫిర్యాదులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా అధికారులు నిరంతరం సమీక్షించుకుంటూ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి
సమస్యలను అధికారుల దృష్టికి చేర్చే ఏకైక మార్గం.
పీజీఆర్‌ఎస్‌లో 169, రెవెన్యూ క్లినిక్‌లో 43 దరఖాస్తుల స్వీకరణ*
**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి ప్రజల సమస్యలను శ్రద్ధగా విని,
సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ కె. ఆర్. కల్పశ్రీ, ఇంచార్జి రెవెన్యూ అధికారి పి. ప్రభాకర్, పీజీ ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, తదితర అధికారులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో అందుతున్న ప్రతి ఫిర్యాదును నిబంధనల మేరకు నిర్దేశిత గడువు లోపల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు.
కేవలం అర్జీలను క్లోజ్ చేయడం ముఖ్యం కాదని, క్షేత్రస్థాయిలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. అధికారులు రీ-ఓపెన్ (మళ్లీ వచ్చే) అర్జీల సంఖ్య తగ్గాలని అన్నారు.
ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రత, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకే సమస్యపై ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 169 దరఖాస్తులు, అలాగే రెవెన్యూ క్లినిక్‌లో 43 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
*స్వీకరించిన అర్జీలలో కొన్ని:-
**పోడూరు మండలం పూజారి వారి గరువు నుండి ఇళ్ల లక్ష్మి నాకు ఇద్దరు పిల్లలు పాప పదో తరగతి, బాబు ఎనిమిదోవ తరగతి చదువుచున్నారు. మా ఫ్యామిలీ మ్యాపింగ్ లో మా తమ్ముడు పేరు చెల్లిబోయిన రవి ఉండుటవలన మా పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడటం లేదు ఫ్యామిలీ మ్యాపింగ్ నుండి ఆమె తమ్ముడు పేరు తొలగించాలని కోరారు.
**ఆచంట మండలం, వల్లూరు గ్రామం ఉత్తరపాలెంలో ఆర్ అండ్ బి రోడ్డు అవతల ఉన్న నివాస గృహముల వారు వాడకం నీరును మరియు బాత్రూం నీరును రాత్రి సమయంలో పంట బోధి లోనికి వదిలివేయుచున్నారు. పంట పొలములు పాడైపోయి ఇండ్ల వద్ద దోమల బెడద ఎక్కువగా ఉంది పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కడిమి జయలక్ష్మి, జోగి సత్యనారాయణ, యల్లమీల్లి నాని, రామకృష్ణ మూర్తి,తదితరులు కోరారు.
**గణపవరం మండలం, కుముదువల్లి గ్రామం మాజీ సర్పంచ్ పి.శ్రీనివాస్, మరియు గ్రామ ప్రజలు మండలంలోని కుమ్ముదువల్లి గ్రామపంచాయతీ పరిధిలో వదలపాలెం ఆర్ అండ్ బి రోడ్డుకు ఉన్న మురుగు డ్రైన్ పై లేఅవుట్ కొరకు కుక్కల ముసలయ్య బ్రిడ్జి నిర్మించుటకు ప్రయత్నం చేయుచున్నారు. వెంటనే నిలుపుదల చేయాలని కోరారు.
**యలమంచిలి మండలం, ఇలపకుర్రు గ్రామం నుండి కంబాల కస్తూరి, తన భర్త అకాల మరణం చెందుట వలన తన భర్త పేరును ఉన్న ఆస్తిని తన పేరును మార్చుకొనుటకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.
**తాడేపల్లిగూడెం మండలం వెంకట రామన్నగూడెం నుండి ఉక్కునూరి దుర్గ సంబంధించి సర్వే నెంబరు 167-4లో 49 సెంట్లు సర్వే నెంబరు 168-3లో 101 సెంట్లు భూమికి సంబంధించి ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో మొత్తం పది సెంట్లు భూమి తగ్గినది సరిహద్దు భూమిలో చూపిస్తున్నది వెంటనే సర్వే చేయించి తన భూమి కి హద్దులు చూపి న్యాయం చేయాలని కోరారు.
**భీమవరం మండలం, యనమదుర్రు గ్రామం డేగాపురం నుండి పిల్లి ఫిలిప్, తన సరిహద్దు పొలం వారు ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా చేపల చెరువు తవ్వకం చేస్తున్నారు. వాటి వల్ల తన పొలంకు పంట నష్టం జరుగుతుంది అని వెంటనే ఆపే చర్యలు తీసుకోవాలని కోరారు.
వయోవృద్ధులు, వికలాంగులు, నడవలేనివారు తమ పరిధిలోని మండలాల్లో అధికారులకు తమ సమస్యల అర్జీలను దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. పరిష్కరించ దగ్గ ప్రతి అర్జీని కచ్చితంగా పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు.
అనంతరం పి జి ఆర్ ఎస్ అర్జీలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. సమస్యల పరిష్కార ప్రగతి ఎల్లవేళలా మెరుగ్గా ఉండాలని అన్నారు. అధికారులు పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేసే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. తదుపరి సమావేశం నాటికి సమస్యలను పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయో వృద్దుల సంక్షేమ అప్పిలేటు ట్రిబ్యునల్ మెంబర్ యం. దుర్గ ప్రసాద్, అర్జీ దారులు తదితరులు పాల్గొన్నారు.