Close

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Publish Date : 30/06/2025

అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి త్వరితగతిన పరిష్కారం తీసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ తో పాటు,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసి రెడ్డి, కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 256 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత శాఖల అధికారులు లాగిన్ లో పూర్తిస్థాయిలో పరిజ్ఞానాన్ని అవగాహన కలిగి ఉండాలని అధికారులును ఆదేశించారు. అర్జీదార్ల సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. మండల డివిజన్ స్థాయిలో స్వీకరించబడిన ఫిర్యాదుల పరిష్కారంలో సరైన జవాబుదారితనంతో ఉండాలి అన్నారు. పరిష్కరించిన అనంతరం సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారు దృవీకరించబడిన అనంతరం ఫిర్యాదులను ముగించాలని మండల, డివిజన్ అధికారులకు సూచించారు. అలా చేయడం వలన సంబంధిత శాఖల అధికారులకు మండల స్థాయిలో జరిగే ఫిర్యాదులపై పూర్తి అవగాహన, వారు ఇచ్చిన ఎండాస్మెంటుపై క్వాలిటీ తెలుస్తుందని అన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని అన్నారు. అర్జీలు రీఓపెన్ లేకుండా శ్రద్ధ వహించాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించిన సహించేది లేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులు ను ఆదేశించారు.

అర్జీ దారి నుండి స్వీకరించిన ఫిర్యాదుల లో కొన్ని ఇలా ఉన్నాయి

1) పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామానికి చెందిన బోడపాటి రమేష్ అర్జీ సమర్పిస్తూ, తనకు ఇద్దరు కుమార్తెలని నా పెద్ద కుమార్తె బోడపాటి గ్రిష్మ శ్రీ కి సెంటెఅన్స్ హైస్కూల్ తాడేపల్లిగూడెం నందు ఫ్రీ సీటు వచ్చిందని, స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్నారు. ఒక కిలోమీటర్ దూరంలో ఉంటే ఇస్తామన్నారు. మేము మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నామని దయచేసి నా కుమార్తెకు స్కూలు అడ్మిషన్ ఇప్పించాలని కోరారు.

2) పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన దిద్ది శివాని, మాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, అద్దె ఇంట్లో నివాసము ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తనకు ఇంటి స్థలం ఇప్పించాలని అర్జీ ఇచ్చారు.

3) నరసాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండి వెంకట నరసమ్మ అర్జీ సమర్పిస్తూ నాకు ఇద్దరు కుమారులని, కొత్త కాలనీ నందు ఉన్న స్థలంలో గృహం నిర్మించుకుని ఉంటున్నాని, నన్ను ఇంటి నుండి బయటకు గెంటేసారని నా ఇల్లు నాకు ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

4) వీరవాసరం మండలం కొణితవాడ గ్రామానికి చెందిన నరసన్న చెరువు నుండి కోడి గాంధీ అర్జీని సమర్పిస్తూ, మండలంలోని పంజా వేమవరం గ్రామంలో 1.2 ఎకరములు భూమి ఉన్నదని, కొలతలు చూపించగా 98 సెంట్లు మాత్రమే ఉందని, మిగిలిన 4 సెంట్లు సరిహద్దు భూముల్లో ఉన్నదన్నారు. రెండు సార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా న్యాయం జరగలేదు. సర్వే చేయించి నా భూమి నాకు రికార్డు ప్రకారం కొలతలు అప్పచెప్పాలని ఫిర్యాదు చేశారు.

5) ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన తణుకు ప్రసాదరావు అర్జీ సమర్పిస్తూ, తాను పంచాయతీ వాచ్మెన్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యానని 1/1/ 2024 నుండి పింఛన్ రావడం లేదన్నారు. కావున దయవుంచి పింఛను, ఏరియస్ వచ్చేలా చూడాలని కోరారు.

6) ఉండి మండలం చినపులేరు గ్రామం నుండి ఎం. సత్యనారాయణ అర్జీనిస్తూ తాను 80 సెంట్లు చేపల చెరువు సాగు చేసుకుంటున్నానని, నా సరిహద్దు రైతు చేపల చెరువు సాగుకు మాత్రమే అనుమతి తీసుకుని ఉప్పునీటి రొయ్యలు సాగు చేయుచున్నందున సరిహద్దులో ఉన్న చెరువు చేపల పెంపకం కు నష్టం జరుగుచున్నది. దయచేసి పరిశీలించి ఉప్పునీటి రొయ్యల సాగు నిలుపుదల చేయవలసిందిగా కోరుచున్నాను.

7) వీరవాసరం మండలం బలుసు గొయ్యి పాలెం గ్రామం నుండి కవురు ఝాన్సీ లక్ష్మి అర్జీ సమర్పిస్తూ, నాకు 50 సెంట్లు భూమి ఉన్నదని జాయింట్ ఎల్ పి ఎం వలన 3.42 ఎకరాలు భూమిగా చూపిస్తున్నది. అందు వల్ల తల్లికి వందనం పథకం నిలుపుదల చేశారని,సరిచేసి తల్లికి వందనం పథకం డబ్బులు ఇప్పించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.