Close

ప్రజా ఫిర్యాదులు పరిష్కారంలో చక్కటి భాష, సంభాషణ శైలితో వ్యవహరించి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 25/08/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు క్షుణ్ణంగా పరి శీలించిన సిబ్బందితో నిర్ణయిత గడువులోగా పరిష్కార అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒక్కో సందర్భంలో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు స్వయంగా మాట్లాడాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ పంపాలని అన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ లో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 248 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఫిర్యాదుల్లో కొన్ని ఈ విధముగా ఉన్నాయి.

@ వీరవాసరం మండలం వీరవాసరం గ్రామ కాపురస్తులు మేడే పుష్పలత ఆమె కుమార్తె ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుందని, ఆధార్ వివరాల్లో పొరపాట్ల వల్ల తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని, వివరాలను సరిచేసి నగదు జమ అయ్యేలా చూడాలని ఆమె కోరారు.

@ భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన సానబోయిన నరసింహమూర్తి, రాజు, ఇరువురు తమ తల్లి నుంచి సంక్రమించిన ఆస్తి సర్వే చేసి హద్దులు చూపించవలసిందిగా కోరారు.

@ భీమవరం పట్టణం మూడో వార్డుకు చెందిన షేక్ నశ్రీన్ ఇంటి స్థలం మంజూరు చేయమని కోరారు.

@ ఆకివీడు మండలం చిన్నమిల్లిపాడు కాలింగూడెం గ్రామం నుండి బి హెచ్ సుధారాణి, మా పూర్వీకుల నుండి ఉన్న ఆరు సెంట్లు సొంత భూమి ఖాళీగా ఉండడంతో కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. వారిని అడుగగా వారు మాపై దౌర్జన్యం చేస్తున్నారు వారిని ఖాళీ చేయించి మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసి రెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో వ్రయోవృద్ధుల ట్రిబునల్ కమిటీ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.