ప్రజల సామాజిక అవసరాలకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను వినియోగములోనికి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కాళ్ల మండలంలోని పెద అమిరం పంచాయతీ పరిధిలోని పలు ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీఆర్వోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టాటా మార్గ్ (పెద అమిరం పుంత రోడ్డు) లోని మూడు లేఔట్లను, గుడివాడ రోడ్ లోని వెంకటాద్రి రాయల్ ఎస్టేట్ లేఅవుట్ లలో పంచాయతీకి కేటాయించిన 10 శాతం స్థలాలను పరిశీలించారు. రానున్న వారం రోజుల్లో లే అవుట్ల యజమానులతో సమావేశమై ప్రభుత్వ స్థలాల అభివృద్ధికి సంబంధించి చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకర జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఖాళీ స్థలాలను పరిశీలించి వినియోగంలోనికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. అడ్వెంచరల్ స్పోర్ట్స్, పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్కేటింగ్ కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, తదితరాలను పిపిపి మోడ్ లో అభివృద్ధికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంలో పంచాయతీ సెక్రెటరీ నాగేంద్ర, వీఆర్వో కుమార్, తదితరులు ఉన్నారు.