Close

పౌష్టికాహారం, ప్రశాంతతో మంచి ఆరోగ్యమైన బిడ్డ జన్మానికి తోడ్పడుతాయని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘు రామకృష్ణంరాజు అన్నారు.

Publish Date : 25/04/2025

గురువారం ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ పక్వాడా పౌష్టికాహార పక్షోత్సవాల్లో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ నటులు రావు రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, తల్లి ద్వారా బిడ్డకు అందుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. గర్భిణీలు, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించేకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయన్నారు. గర్భిణీ సమయంలో మంచి విశ్రాంతితో పాటు, శ్రావ్యమైన సంగీతాన్ని వినడం, దైవచింతనను కలిగి ఉండటం మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మించడానికి దోహదపడుతుందన్నారు. ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రిని లక్షలాది రూపాయలను ఖర్చుచేసి అభివృద్ధి చేయడం జరిగిందని, దురదృష్టవశాత్తు ప్రసూతి వైద్యులు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం అన్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో డాక్టర్ నియామకానికి మాట్లాడటం జరిగిందని, ఒక వారం లోపుగా ప్రసూతి వైద్యరాలు ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మహిళలకు ఇబ్బంది ఉన్న తనకు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, ఆరోగ్యవంతమైన బిడ్డల జన్మం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందజేయడంలో తోడ్పాటు అందిస్తున్న ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అభినందనీయులన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయన్నారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు మెదడు బాగా అభివృద్ధి చెంది తెలివైన పిల్లలు జన్మిస్తారన్నారు.

చివరిగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఐదు మంది చిన్నారులకు అన్న ప్రాసన, 20 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, ప్రముఖ సినీ నటులు రావు రమేష్, సిడిపిఓ మీ వాణి విజయరత్నం, మోటుపల్లి ప్రసాద్, కూటమి నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, బాలింతలు, చంటి పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.